ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న వారిలో అత్యంత ధనవంతుడు గంభీర్

24-04-2019 Wed 10:53
  • తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్
  • ఆస్తుల విలువ రూ. 147 కోట్లు
  • షీలా దీక్షిత్ ఆస్తుల విలువ రూ. 4.92 కోట్లు

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 147 కోట్లుగా ఆయన చూపాడు. ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడు గంభీరే. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను తన ఆదాయాన్ని రూ. 12.4 కోట్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల్లో గంభీర్ చూపాడు. గంభీర్ భార్య నటాషా గత ఏడాది ఆదాయాన్ని రూ. 6.15 లక్షలుగా పేర్కొన్నారు మరోవైపు, తనపై ఒక క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపాడు.

పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రా తన ఆస్తిని రూ. 45 కోట్లుగా చూపించారు. దక్షిణ ఢిల్లీ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, బాక్సింగ్ ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ తన ఆస్తుల విలువను రూ. 12.14 కోట్లుగా పేర్కొన్నాడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తన ఆస్తి విలువను రూ. 4.92 కోట్లుగా వెల్లడించారు.