Andhra Pradesh: ఏపీలో జనసేన ఆఫీసుల మూసివేత వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్!

  • నియోజకవర్గాల్లో ఆఫీసులు కొనసాగుతాయి
  • ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
  • పార్టీ అభ్యర్థులకు జనసేనాని దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు ఇటీవల పలు ఫొటోలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొనడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేననీ, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
office closed
responded

More Telugu News