anasuya: చిరూ .. అల్లు అర్జున్ సినిమాల్లో అనసూయ

  • అనసూయ ప్రధాన పాత్రధారిగా రెండు సినిమాలు
  • ఈ ఏడాదిలోనే రానున్న సినిమాలు 
  • వచ్చే ఏడాది పెద్ద ప్రాజెక్టులు  

బుల్లితెరపై అనసూయకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్ కారణంగానే వెండితెర నుంచి ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. అయితే అనసూయ తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'సచ్చిందిరా గొర్రె' .. 'కథనం' అనే రెండు సినిమాలు వున్నాయి. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ రెండు సినిమాలు, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ సినిమాల తరువాత ఆమె రెండు కొత్త ప్రాజెక్టులను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. చిరంజీవితో కొరటాల శివ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. ఇక అల్లు అర్జున్ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన అనసూయను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. 'రంగమ్మత్త' స్థాయిలో ఈ పాత్ర ఆమెకు పేరు తీసుకురావడం ఖాయమని అనసూయకి సుకుమార్ చెప్పాడట. మొత్తానికి వచ్చే ఏడాదికి అనసూయ చేతిలో రెండు మంచి ప్రాజెక్టులు ఉన్నట్టే.

More Telugu News