nellore: శ్రీలంక ఎఫెక్ట్: నెల్లూరు జిల్లాలోని 125 గ్రామాల్లో హైఅలర్ట్

  • శ్రీలంక ఉగ్రదాడుల నేపథ్యంలో హైఅలర్ట్
  • షార్, కృష్ణపట్నం పోర్టులకు భద్రత కట్టుదిట్టం
  • మెరైన్, కోస్ట్ గార్డ్ దళాల గస్తీ ముమ్మరం
శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించడంతో నెల్లూరు జిల్లాలోని 125 తీరప్రాంత గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం, కృష్ణపట్నం పోర్టులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. మత్స్యకార గ్రామాల్లో పోలీసులు ప్రజలతో సమావేశాలు నిర్వహించి, అనుమానితులు, కొత్తవారు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. దీనికి తోడు, సముద్రంలో మెరైన్ గస్తీ, కోస్ట్ గార్డ్ దళాల గస్తీని ముమ్మరం చేశారు. శ్రీలంక వైపు నుంచి వచ్చే బోట్లను నిశితంగా గమనిస్తున్నారు.
nellore
villages
high alert

More Telugu News