T congress: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడాలి: వీహెచ్

  • పార్టీ మారే ఎమ్మెల్యేలను ఆపడంలో కాంగ్రెస్ విఫలం
  • పార్టీ ఇంఛార్జిలు చూసీచూడనట్టుగా ఉంటున్నారు
  • ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం దారుణం
పార్టీని వీడే ఎమ్మెల్యేలను ఆపడంలో ‘కాంగ్రెస్’ విఫలమైందని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించారు. ‘కాంగ్రెస్’ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నా, పార్టీ ఇంఛార్జిలు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బున్నవారే రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ నేతలు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెడుతుంటే పోలీసులతో పాటు, ఈసీ ఖర్చును నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లడం చాలా దారుణమని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడాలని పిలుపు నిచ్చారు.
T congress
VH
Uttam Kumar Reddy

More Telugu News