విజయసాయిరెడ్డి తప్పుడు వాదన చేస్తున్నారు: యనమల
- సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ లు పెట్టుకోవచ్చు
- కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు
- ఈ రోజు ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తాం
ఈ లేఖపై ఏపీ మంత్రి యనమల మండిపడ్డారు. కనీస అవగాహన కూడా లేకుండా ఈసీకి విజయసాయిరెడ్డి లేఖ రాశారని అన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ లు పెట్టుకోవచ్చని చెప్పారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. మంత్రిమండలి కంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎక్కువ కాదని చెప్పారు. ఈరోజు ఎన్నికల మీద సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.