Supreme Court: 20 ఏళ్ల సేవకు గుర్తింపు ఇదేనా?.. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన జస్టిస్ గొగోయ్!

  • ఈ ఆరోపణల వెనుక బలీయమైన శక్తులు ఉన్నాయి
  • సదరు మహిళకు గతంలో నేరచరిత్ర ఉంది
  • న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ ఉద్యోగిని ఒకరు జడ్జీలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటుచేశారు. ఈ విషయంపై విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

తాను జడ్జీగా 20 ఏళ్లు పనిచేశాననీ, తన బ్యాంకు బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉండగా, పీఎఫ్ సొమ్ము రూ.40 లక్షలు మాత్రమే ఉందని గొగోయ్ తెలిపారు. ‘డబ్బు విషయంలో తనను దెబ్బకొట్టలేని కొన్ని శక్తులు ఈ ఆరోపణలు చేయిస్తున్నాయి. ఇప్పుడు భారత న్యాయవ్యవస్థ చాలా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది.

న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నాపై వచ్చిన ఆరోపణల వెనుక చాలా బలీయమైన శక్తులు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళకు గతంలో నేరచరిత్ర ఉందని జస్టిస్ గొగోయ్ ఆరోపించారు.

More Telugu News