USA: అమెరికాలో తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం!

  • స్టూడెంట్ వీసాపై యూఎస్ వెళ్లిన విశ్వనాథ్
  • కాలేజీలోని కంప్యూటర్లలోకి 'యూఎస్బీ కిల్లర్' బగ్
  • రూ. 40 లక్షల నష్టం కలిగించడంతో అరెస్ట్

అమెరికాలోని ఓ కాలేజీలోని కంప్యూటర్లకు భారీ నష్టం కలిగించిన నేరానికి ఆకుతోట విశ్వనాథ్ (27) అనే తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్‌ 2015లో స్టూడెంట్‌ వీసాపై అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలోని సెయింట్‌ రోజ్‌ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో 'యూఎస్బీ కిల్లర్‌' అనే బగ్ ఉన్న పెన్‌ డ్రైవ్‌ తెచ్చి, కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేయడం ద్వారా రూ. 40 లక్షల నష్టం కలిగించాడు. తాను చేసిన ఘనకార్యాన్ని మొబైల్ ఫోన్ లో షూట్ చేశాడు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో విచారించిన నార్త్‌ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ ను అరెస్ట్‌ చేసి కోర్టుముందు హాజరు పరిచారు. ఉద్దేశపూర్వకంగానే తాను ఈ పని చేశానని అంగీకరించిన విశ్వనాథ్, జరిగిన నష్టాన్ని చెల్లిస్తానని చెప్పాడు. డబ్బు చెల్లించినా, అతనికి శిక్ష ఖాయమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News