Google: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓటేసినట్టు వైరల్ న్యూస్... అసలు నిజమిది!

  • నిన్న సుందర్ పిచాయ్ ఓటేసినట్టు ఫోటోలు
  • అవి 2017 నాటివని తేల్చిన నెటిజన్లు
  • సుందర్ ఓటేద్దామన్నా అవకాశం లేదని వెల్లడి

నిన్న జరిగిన రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ ఓటేశాడని, అందుకోసం ఆయన స్వయంగా అమెరికా నుంచి వచ్చారని ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ తో పాటు, ఆయన కొంతమంది ఇండియన్స్ మధ్య ఉన్న ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ప్రచారం అంతా అవాస్తవమని తేలిపోయింది. రెండేళ్ల క్రితం ఖరగ్ పూర్ ఐఐటీని సుందర్ పిచాయ్ సందర్శించినప్పటి ఫోటో ఇదని నెటిజన్లు తేల్చారు. అప్పట్లో స్వయంగా సుందర్ ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారని వాస్తవాన్ని చెబుతున్నారు. సుందర్ తమిళనాడులోని మధురైలో జన్మించినా, అతనికి అమెరికా పౌరసత్వం ఉంది కాబట్టి, ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనర్హుడని, కేవలం భారత పౌరసత్వం ఉన్న ప్రవాస భారతీయులకు మాత్రమే ఓటేసే హక్కు ఉంటుందని గుర్తు చేస్తున్నారు.




More Telugu News