నేను వెనకబడటానికి ఇవే కారణాలు: హీరో సాయిధరమ్ తేజ్
- కథల ఎంపిక విషయంలో పొరపాట్లు జరిగాయి
- సినిమా సరైన సమయంలో విడుదల కావాలి
- నా సినిమాలపై ఎవరి ఒత్తిడి వుండదు
అందుకు ఆయన స్పందిస్తూ .. "సరైన కథలను ఎంచుకోకపోవడం మొదటికారణంగా భావిస్తాను. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనుకున్న కంటెంట్ ఒక్కోసారి వాళ్లకి రీచ్ కాదు. ఫలితంగా సినిమా సరిగ్గా ఆడకపోవడం జరుగుతుంటుంది. ఇక సరైన సమయంలో విడుదల అనేది కూడా సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో విడుదల కాకపోతే కూడా ఆ సినిమాలు దెబ్బతింటూ ఉంటాయి. సినిమా పరాజయంపాలు కావడానికి ఇది రెండవ కారణమని నా అభిప్రాయం. ఇక నా చుట్టూవున్న కొంతమంది ఒత్తిడి చేయడం వలన, నేను కథలను గురించి పట్టించుకోకుండా ఒప్పేసుకుంటాననే టాక్ వుంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు" అని ఆయన చెప్పుకొచ్చాడు.