Jet Air Ways: ‘జెట్ ఎయిర్ వేస్’లో కొనసాగుతున్న సంక్షోభం.. ఈరోజు అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ సర్వీసులూ బంద్ !

  • ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత
  • గత ఆరు నెలలుగా ఆర్థిక ఇబ్బందుల్లో సంస్థ  
  • ముంబైలో రేపు సమావేశం కానున్న ‘జెట్ ఎయిర్ వేస్’

‘జెట్ ఎయిర్ వేస్’ లో సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సంస్థ వెల్లడించింది.

కాగా, గడచిన ఆరు నెలలుగా ‘జెట్ ఎయిర్ వేస్’ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీనిని అధిగమించడానికి ఈ సంస్థ రూ.400 కోట్ల అప్పు కోసం ప్రయత్నించినప్పటికీ, ఇచ్చేందుకు పలు సంస్థలు నిరాకరించాయి. దీంతో, జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా, ముంబైలోని జెట్ ఎయిర్ వేస్ ప్రధాన కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. యాజమాన్యంతో ఉద్యోగులు, అధికారుల సంఘాలు భేటీ కానున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు శాంతి యుత నిరసనకు దిగనున్నట్లు సమాచారం.

More Telugu News