Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో మరో దాడి.. సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు!

షార్ట్స్‌లో చూడండి
జమ్ముకశ్మీర్ లో మరోమారు ఉగ్రవాదులు తెగబడ్డారు. పుల్వామా జిల్లాలోని నౌదల్ వద్ద సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ శిబిరంలోని 180వ బెటాలియన్ ఉన్న చోట ఈ దాడి జరిగినట్టు అధికారుల సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దాదాపు రెండు నెలల క్రితం ఇదే జిల్లాలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలభై మందికి పైగా జవాన్లు మృతి చెందారు.
Go Back to Shorts
Jammu And Kashmir
pulwama
nowdal
crpf

More Telugu News