nirmala seetharaman: పాకిస్థాన్ మద్దతుతో బీజేపీని ఓడించాలని చూస్తున్నారు: నిర్మలా సీతారామన్

షార్ట్స్‌లో చూడండి
మోదీ మరోసారి భారత ప్రధాని కావాలంటూ పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఇమ్రాన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కుట్రలో భాగమేనని చెప్పారు. మోదీని గద్దె దించడం కోసం కాంగ్రెస్ లోని ప్రముఖ నాయకులు పాకిస్థాన్ కు వెళ్లి, వాళ్ల మద్దతు కోరుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాల్లో ఇది కూడా ఒక భాగమే అనిపిస్తోందని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దీనికి పార్టీతో సంబంధం లేదని అన్నారు.

ఎన్నికల సమయంలో మహిళా నాయకులపై విమర్శలు హద్దుమీరుతున్నాయని... కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడటం మంచిది కాదని నిర్మల హితవు పలికారు. పార్టీలకు అతీతంగా నాయకుల మధ్య సంబంధాలు కొనసాగాలని చెప్పారు. జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె ఈ మేరకు స్పందించారు. 
Go Back to Shorts
nirmala seetharaman
pakistan
congress
bjp

More Telugu News