manda krishna madiga: మంద కృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

  • అంబర్ పేటలోని నివాసంలో గృహ నిర్బంధం
  • తెల్లవారుజామునే ఇంటికి చేరుకున్న పోలీసులు
  • తప్పుబడుతున్న ఎమ్మార్పీఎస్ నేతలు

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ అంబర్ పేటలోని డీడీ కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు... ఇంటి నుంచి ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు.

అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని మంద కృష్ణ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దళితుడైనందునే అంబేద్కర్ ను కేసీఆర్ అవమానించారని విమర్శించారు. కేసీఆర్ ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడటం లేదని... అంబేద్కర్ జయంతి రోజున ప్రగతి భవన్ లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు.

అగ్రకులస్తుడైన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో హైదరాబాదుకు వచ్చినప్పుడు ఆయనకు కేసీఆర్ పాదాభివందనం చేశారని... దళితుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మాత్రం పుష్పగుచ్ఛం ఇచ్చి, కరచాలనం చేశారని విమర్శించారు. ఈ నెల 22వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలు, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ హౌస్ అరెస్ట్ ను ఎమ్మార్పీస్ నేతలు తప్పుబడుతున్నారు.

More Telugu News