Nellore District: ఆత్మకూరు ఆర్వో, తహసీల్దార్ పై క్రిమినల్ కేసుల నమోదు

  • ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో వీవీ ప్యాట్ స్లిప్పులు   
  • ఈ ఘటనపై పోలీసులకు కలెక్టర్ ఫిర్యాదు
  • ఆర్వో చినరాముడు, తహసీల్దార్ విద్యాసాగరుడుపై కేసులు 
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీప్యాట్ స్లిప్పులు పడి ఉన్న ఘటన విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి చినరాముడు, తహసీల్దార్ విద్యాసాగరుడుపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్షణ సమయంలో వాడిన స్లిప్పులను కూడా జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ ఘటనపై స్థానిక అధికారులను వివరణ కోరతామని నిన్న కలెక్టర్ పేర్కొన్నారు.
Nellore District
atmakur
vvpat`s

More Telugu News