Gopala krishna Dwivedi: ఎవరో ఉద్యోగి కావాలనే వీవీప్యాట్ స్లిప్పులను బయట పడేశారు: సీఈవో ద్వివేది

  • బయటపడిన స్లిప్పులు పోలింగ్ రోజువే కాదు
  • ఆత్మకూరు ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణం
  • వెయ్యి ఓట్లను ముందు పోల్ చేశారు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జడ్పీ పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఈవీఎం కమిషనింగ్ సెంటర్ మాత్రమేనని, బయటపడిన స్లిప్పులు అసలు పోలింగ్ రోజువే కాదన్నారు.

ఎవరో ఉద్యోగి వీవీప్యాట్ స్లిప్పులను కావాలని బయట పడేశారని, దీనికి ఆత్మకూరు ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోలింగ్‌కు ముందు పోల్ చేశారన్నారు. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయని నిర్థారించుకున్న మీదటే పోలింగ్ కేంద్రాలకు తరలించామని ద్వివేది తెలిపారు.

More Telugu News