Nellore District: ఆత్మకూరులో పడివున్న వీవీ ప్యాట్ స్లిప్పులపై రిటర్నింగ్ అధికారి వివరణ

  • ఆత్మకూరు ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో  స్లిప్పులు
  • వాటిని పరిశీలించిన ఆత్మకూరు ఆర్వో
  • ఈ ఘటనపై వివరణ కోరతామన్న కలెక్టర్

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో వీవీప్యాట్ స్లిప్పులు పడి ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఈ స్లిప్పులను పరిశీలించారు. తర్వాత వివరణ ఇస్తూ, కళాశాల వద్ద పడిఉన్న స్లిప్పులు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినప్పుడు వాడినవి అని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్షణ సమయంలో వాడిన స్లిప్పులను కూడా జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ ఘటనపై స్థానిక అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ తెలిపారు.

More Telugu News