New Delhi: సీఈసీని కలిసిన వైసీపీ నేతల బృందం

  • ఈసీ నియామవళి ఉల్లంఘిస్తున్న టీడీపీ 
  • ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి
  • సీఈసీని కోరిన వైసీపీ నేతల బృందం
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ను వైసీపీ నేతల బృందం ఈరోజు కలిసింది. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పులు, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీలో ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సీఈసీని కోరినట్టు తెలుస్తోంది. సీఈసీని కలిసిన ఈ బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి.రామచంద్రయ్య, అవంతి, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.
New Delhi
YSRCP
botsa
vijayasai reddy
CEC

More Telugu News