karthi: జ్యోతిక సోదరుడిగా కనిపించనున్న కార్తీ

  • వరుస సినిమాలతో కార్తీ 
  • విడుదలకి సిద్ధంగా 'ఖైదీ'
  • నిర్మాతగా జ్యోతిక సోదరుడు  
జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా, కార్తీ వరుస సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖైదీ' ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన చేయనున్న సినిమాలో జ్యోతిక ఒక కీలకమైన పాత్రను పోషించనుందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. జ్యోతిక సోదరుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు.

మలయాళ దర్శకుడు .. 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి జ్యోతిక సోదరుడు సూరజ్ నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరు? మిగతా పాత్రల్లో ఏయే నటీనటులు కనిపించనున్నారు? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. నిజ జీవితంలో జ్యోతికకి మరిది అయిన కార్తీ .. ఆమెకి సోదరుడిగా నటించడం ఆసక్తిని కలిగించే విషయమే మరి.
karthi
jyothika

More Telugu News