Chandrababu: వాళ్లకు సజెషన్స్... మాకు యాక్షన్స్!: చంద్రబాబు

  • ఓటర్ల స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు
  • ఇష్టానుసారం ప్రవర్తించారు
  • గట్టిగా అడిగితే మేం ప్రధానమంత్రి అంతటివాడికే సూచనలు చేశాం అన్నారు
ఏపీలో పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏ అంశంలో సక్సెస్ అయ్యారో చూపించాలంటూ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్నింటా దారుణ వైఫల్యాలేనంటూ మండిపడ్డారు. రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఈసీపై విమర్శలు గుప్పించారు. ఓటర్ల స్ఫూర్తిని అడుగడుగునా నిర్వీర్యం చేసి ఇష్టానుసారం ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అధికారుల బదిలీలపై ప్రశ్నిస్తే, మేం ఉత్తరప్రదేశ్ సీఎంకే చెప్పాం, గవర్నర్ కే చెప్పాం, ప్రధానమంత్రి అంతటివాడికే సూచనలు చేశాం అంటూ ఇప్పుడు కూడా ఆయన ఏదో చెబుతున్నాడు. వాళ్లకు సజెషన్స్... మాకు యాక్షన్స్!" అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఓటు గురించి చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News