largest airplane: వామ్మో.. ఎంత పెద్ద విమానమో.. విజయవంతంగా టేకాఫ్!

  • బరువు రెండు లక్షల కిలోలు
  • రెక్కల పొడవు 385 అడుగులు
  • కాలిఫోర్నియాలోని మోజేవే విమానాశ్రయం నుంచి టేకాఫ్

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం శనివారం తొలిసారి టేకాఫ్ అయింది. 2,26,800 కేజీల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు ఏకంగా 385 అడుగులు. కాలిఫోర్నియాలోని మోజేవే విమానాశ్రయం నుంచి తొలి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం రికార్డు సృష్టించింది. స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ దీనిని నిర్మించింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్ 2011లో ఈ కంపెనీని స్థాపించారు.

గాలిలో నుంచి కక్ష్యలోకి రాకెట్లను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించి ఈ విమానాన్ని తయారుచేశారు. ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు  (డ్యూయల్ ఫ్యూజ్‌లేజ్) కలిగిన ఈ విమానం గరిష్టంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు. ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది.

More Telugu News