nani: 'జెర్సీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెంకటేశ్

  • విభిన్నమైన పాత్రలో కనిపించనున్న నాని
  •  ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  •  19వ తేదీన భారీస్థాయిలో సినిమా విడుదల

ఒకే తరహా సినిమాలు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడనే విమర్శ ఎదురుకాగానే నాని తన రూటు మార్చుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుని, 'జెర్సీ'తో ఆచరణలో పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది.

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈలోగా .. అంటే ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు రాత్రి 7గంటల 30 నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ .. స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో నాని ఖాతాలోకి మరో హిట్ చేరడం ఖాయమనేది అభిమానుల మాట.

More Telugu News