Andhra Pradesh: ఏపీలో 141 సీట్లతో టీడీపీ అధికారంలోకి రాబోతోంది!: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

  • టీడీపీ బలంగా ఉన్నచోటే ఈవీఎంలు మొరాయించాయి
  • దీనివెనుక మోదీ, కేసీఆర్, జగన్ కుట్ర ఉంది
  • గుంటూరులో మీడియాతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 141 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లాలోని 17 స్థానాలనూ టీడీపీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ వైసీపీ నేతలు చాలా కుట్రలు పన్నారనీ, అయినా ప్రజలు టీడీపీవైపే నిలబడ్డారని వ్యాఖ్యానించారు.

గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నచోట మాత్రమే ఈవీఎంలు మొరాయించాయని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. టీడీపీ నేతలపై ఐటీ దాడుల వెనుక మోదీ, కేసీఆర్ జగన్ కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telugudesam
Guntur District
gv anjaneyulu
141 seats

More Telugu News