Telangana: చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులు అమ్మేసి ఏపీలోనే ఉండాలి: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • ఏపీ పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఈ పని చేయాలి
  • పర్మినెంట్ గా ఆంధ్రాలోనే ఉండిపోవాలి
  • అప్పుడు, బాబు మాట్లాడింది రైటో రాంగో ప్రజలు నిర్ణయిస్తారు
హైదరాబాద్ లో ఆస్తులున్న ఏపీ టీడీపీ నేతలను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించడంపై తెలంగాణ మంత్రి తలసాని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నిజంగా నీతిమంతుడైతే, హైదరాబాద్ లో తనకున్న ఆస్తులను అమ్ముకుని ఆంధ్రాలోనే ఉండాలని సూచించారు.

‘ఏపీ పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే కనుక హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు అమ్మేసుకుని పర్మినెంట్ గా అక్కడే ఉండాలి. అప్పుడు, నువ్వు మాట్లాడింది రైటా? రాంగా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు గెలిచినా, ఓడిపోయినా ఏపీలోనే ఉండాలి ’ అని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు మాట్లాడారని, నాలుగు ఓట్ల కోసం ఎంతో దారుణంగా మాట్లాడారని దుయ్యబట్టారు. 
Telangana
talasani
minister
Chandrababu
cm

More Telugu News