Andhra Pradesh: బీజేపీ బ్రాంచ్ కార్యాలయంగా ఈసీ మారిపోయింది.. ఇలాగైతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు!: మంత్రి ప్రత్తిపాటి హెచ్చరిక

  • ఏపీ ఎన్నికల్లో ఈసీ పక్షపాతంతో వ్యవహరించింది
  • మోదీ, షా కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీ వచ్చాం
  • క్యూలైన్లలో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు: దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. బీజేపీ బ్రాంచ్ కార్యాలయంగా ఈసీ మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. మోదీ, అమిత్ షా కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి వచ్చామని వ్యాఖ్యానించారు.

ఈరోజు ఢిల్లీలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వర్ల రామయ్యతో కలిసి ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలోని 22 రాజకీయ పార్టీలు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందిగా కోరాయని గుర్తుచేశారు. ఈవీఎంలు మొరాయించడంతో క్యూలైన్లలో నిలబడ్డ మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు.

More Telugu News