అప్పుడు ఈవీఎంలను తప్పుబట్టని చంద్రబాబు ఇప్పుడు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం: ధర్మాన ప్రసాదరావు విమర్శ
- 2014లో లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు?
- టీడీపీ గెలుస్తుందంటూనే ఈవీఎంలు పనిచేయడం లేదంటున్నారు
- విజయవాడలో మీడియాతో వైసీపీ నేత
టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓవైపు టీడీపీకి 130 సీట్లు వస్తాయని చెబుతూనే, మరోవైపు ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని చంద్రబాబు వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేతలు గౌరవించాలనీ, ఏవైనా సమస్యలు ఉంటే సూచనలు చేయాలని ధర్మాన స్పష్టం చేశారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన బాధ్యత నేతలపై ఉంటుందని వ్యాఖ్యానించారు.