rakul preet singh: అదరగొడుతున్న రకుల్ పెళ్లి పాట.. సోషల్ మీడియాలో వైరల్!

  • 'దే దే ప్యార్ దే' చిత్రంలో నటించిన రకుల్
  • యూట్యూబ్ ను ఊపేస్తున్న రకుల్ పాట
  • గంటల వ్యవధిలోనే 9 లక్షల మందికి పైగా వీక్షించిన వైనం

యూట్యూబ్ ను రకుల్ ప్రీత్ సింగ్ షేక్ చేస్తోంది. బాలీవుడ్ లో ఆమె నటించిన తాజా చిత్రం 'దే దే ప్యార్ దే'. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ సరసన రకుల్, టబు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని 'వడ్డీ షరాబన్' పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో రకుల్ అందాలను ఆరబోసింది. ఓ పెళ్లిలో చిందేస్తూ హుషారెత్తించింది. ఈ పాట విడుదలైన గంటల వ్యవధిలోనే యూట్యూబ్ లో 9 లక్షల మందికి పైగా వీక్షించారు.

దీనిపై రకుల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఇది గొప్ప అనుభవమని చెప్పింది. 'వడ్డీ షరాబన్' పాట షూటింగ్ చాలా సరదాగా జరిగిందని తెలిపింది. ఇంత మంచి పాటను తనకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాకు అకీవ్ అలీ దర్శకత్వం వహించారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News