Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం

  • వెల్లడించిన రష్యా దౌత్య కార్యాలయం
  • సంబంధాల బలోపేతానికి కృషి చేశారు
  • కృషి ఫలితమే ఈ పురస్కారం ఇస్తున్నాం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అవార్డు ప్రకటించింది. రష్యాకు భారతదేశం సుదీర్ఘకాలం మిత్రదేశం అన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాలదీ కాలపరీక్షకు నిలిచిన స్నేహం. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా స్నేహసంబంధాల్లో ఎలాంటి తేడా రాలేదు. ఈ క్రమంలో, బంధం మరింత బలపడేలా భారత ప్రధానికి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారాన్ని అందివ్వాలని రష్యా అధినాయకత్వం నిర్ణయించుకుంది. రష్యాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ మేరకు రష్యా దౌత్యకార్యాలయం వెల్లడించింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత దృఢతరం కావడానికి మోదీ ఎంతో కృషి చేశారని, ఆ కృషికి గుర్తింపుగానే అవార్డు ఇస్తున్నామని రష్యా దౌత్య కార్యాలయం తెలిపింది.

More Telugu News