EVMs: స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత!

  • గెలుపెవరిదో తేల్చే ఈవీఎంలు
  • తొలి దశలో సాయుధులైన బలగాల కాపలా
  • ఆపై రాష్ట్ర ప్రత్యేక బలగాల పహారా

ఎపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపెవరిదో తేల్చే ఈవీఎంలు వివిధ జిల్లాల్లోని స్ట్రాంగ్ రూములకు చేరాయి. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి. తొలి దశలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తలుపులకు సీల్ వేసిన చోట సాయుధులైన కేంద్ర బలగాలు కాపలా ఉంటాయి. ఇది మొదటి దశ భద్రత.

ఇక రెండో దశలో రాష్ట్ర పత్యేక బలగాలు కాపలా ఉంటాయి. మూడో దశలో స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. ఇక ప్రధాన పార్టీల ఏజంట్లు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉండనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు ఫిఫ్ట్ ల వారీగా ఈవీఎంలకు కాపలా కాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ కార్యకర్తలను ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉంచనుంది. మొత్తం 40 రోజుల పాటు ఈవీఎంలను భద్రతా దళాలు కాపాడనుండగా, వచ్చే నెల 23న వీటిని బయటకు తీసి, ఓట్లను లెక్కించనున్నారు. 

More Telugu News