ఆసుపత్రి నుంచి అంబులెన్సులో నేరుగా వచ్చి ఓటేసిన కాంగ్రెస్ నేత!
- ఇటీవల అనారోగ్యానికి గురైన ముఖేశ్ గౌడ్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓటేసేందుకు రాక
- రాజా సింగ్ చేతిలో గతంలో ఓడిపోయిన ముఖేశ్ గౌడ్
ఈ సందర్భంగా అక్కడకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖేశ్ గౌడ్ అభివాదం చేశారు. అనంతరం అంబులెన్సులో ఆసుపత్రికి తిరిగివెళ్లిపోయారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీచేసిన ముఖేశ్ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ నేత రాజాసింగ్ ఇక్కడ విజయం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ రెండో స్థానంలో నిలిచారు.