తాడిపత్రిలో వేటకొడవళ్లతో నరుక్కున్న టీడీపీ-వైసీపీ వర్గాలు.. ఇద్దరు కార్యకర్తల దుర్మరణం!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. ఈరోజు తాడిపత్రిలోని వీరాపురంలో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తలెత్తింది. అది కాస్తా ఘర్షణగా మారడంతో ఇరువర్గాలు వేటకొడవళ్లతో పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో అక్కడి ఓటర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఈ ప్రాంతం రణరంగంగా మారింది.

ఈ దుర్ఘటనలో టీడీపీ కార్యకర్త భాస్కరరెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Anantapur District
attack
Telugudesam
YSRCP
2 dead

More Telugu News