gudivada: గుడివాడ నియోజకవర్గంలో గందరగోళం.. పోలింగ్ నిలిపివేసి, మళ్లీ ప్రారంభించిన అధికారులు

  • చౌటపల్లి గ్రామంలోని రెండు బూత్ లలో గందరగోళం
  • టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి వెళ్తున్న వైనం
  • కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసిన అధికారులు

ఏపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని చౌటపల్లి గ్రామంలోని 172, 173 పోలింగ్ బూత్ లలో... టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి వెళ్తోందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిరసన చేపట్టారు. పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయా కేంద్రాల్లో వెంటనే పోలింగ్ ను నిలిపివేసి, కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి, మళ్లీ పోలింగ్ ను ప్రారంభించారు.

ఇదే విధంగా విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్ లో టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వెళ్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో, ఆ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది.

More Telugu News