Telangana: హైదరాబాద్ లో ఓటేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

  • ప్రజల భవిష్యత్ ను నిర్దేశించే శక్తి ఓటుకుంది
  • హైదరాబాద్ వాసులంతా ఓటేయండి
  • ప్రజలను కోరిన తెలంగాణ మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్తును నిర్దేశించే శక్తి ఓటుకు ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలంతా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 
Telangana
Hyderabad
TRS
vote
KTR

More Telugu News