Karnataka: ఎన్నికల ప్రచారంలో నాగిని డ్యాన్స్ చేసిన కర్ణాటక మంత్రి... వీడియో!

  • బెంగళూరులో ప్రచారం చేసిన ఎంటీబీ నాగరాజ్
  • కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా నృత్యం
  • కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వినతి
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్, నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. బెంగళూరు రూరల్ పరిధిలోని హోస్కోటె ప్రాంతంలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన, ఆ సమయంలో మైక్ లో వినిపించిన పాటకు అనుగుణంగా నృత్యం చేశారు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే, కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాగరాజ్ నాగిని డ్యాన్స్ వీడియోను మీరూ చూడవచ్చు.



Karnataka
Nagaraj
Minister
Nagin Dance

More Telugu News