ఇప్పటికైనా తెలిసి వచ్చిందా?: ఈవీఎంల మొరాయింపుపై ఈసీని ప్రశ్నించిన చంద్రబాబు!
- ఈవీఎంలతో నష్టమే
- బ్యాలెట్ అయితేనే మేలు
- ఈవీఎంల వాడకంపై రివిజన్ పిటిషన్ వేసే ఆలోచన
- ఓటు వేసిన అనంతరం చంద్రబాబు
ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటినుంచో మాట్లాడుతున్నానని, ఇప్పటికైనా ఈసీ అర్థం చేసుకోవాలని అన్నారు. ఈవీఎంలతో జరిగే నష్టాన్ని గుర్తించాలని కోరారు. బ్యాలెట్ అయితే ఏ సమస్యా ఉండదన్నారు. ఈవీఎంల వాడకంపై రివిజన్ పిటిషన్ వేయాలన్న ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు.