Nagarjuna: నాగచైతన్య స్థానంలో అఖిల్... నాగ్ మనవడి పాత్రకు ఎంపిక!

  • 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి రెండో భాగంగా 'బంగార్రాజు'
  • నాగచైతన్య కన్నా అఖిల్ అయితే బాగుంటుందని ఆలోచన
  • 'మన్మధుడు-2' కాగానే 'బంగార్రాజు' మొదలు!

నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి రెండో భాగంగా 'బంగార్రాజు' చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు మనవడి పాత్రలో తొలుత నాగచైతన్య నటించనున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ పాత్రను నాగచైతన్య కన్నా అఖిల్ తో నటింపజేస్తే బాగుంటుందన్న దర్శకుడి అభిప్రాయంతో నాగ్ ఏకీభవించినట్టు తెలుస్తోంది. బంగార్రాజుకు, అతని మనవడికి మధ్య జరిగే కథతో ఈ సినిమా నిర్మితమవుతుండగా, ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ కు తుది రూపును ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. నాగ్ ఇప్పుడు 'మన్మధుడు-2' షూటింగ్ లో ఉండగా, అది పూర్తికాగానే 'బంగార్రాజు' మొదలవుతుందని సమాచారం.

More Telugu News