Jagan: భార్య భారతితో కలసివెళ్లి ఓటేసి వచ్చిన వైఎస్ జగన్!

షార్ట్స్‌లో చూడండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, కొద్దిసేపటిక్రితం పులివెందులలోని భాకరాంపురం ఎంపీపీఎస్ స్కూల్ లో ఓటేశారు. జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ వెళ్లే సమయానికే పోలింగ్ బూత్ వద్ద పలువురు ఓటర్లు ఉండటంతో, కాసేపు జగన్ దంపతులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు ఎలావున్నాయని ఓటర్లను జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులనూ పలకరించిన ఆయన, వారికి కల్పించిన సదుపాయాలపై ఆరా తీశారు.
Go Back to Shorts
Jagan
Bharati
Vote

More Telugu News