Andhra Pradesh: ఏపీలో ఐటీ దాడులు.. మీడియా ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ!

  • అవినీతికి వ్యతిరేకంగానే దాడులు జరుగుతున్నాయి
  • వీటిని రాజకీయ కక్షసాధింపు చర్యలు అనడం సరికాదు
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న టీడీపీ నేత గల్లా జయదేవ్ అకౌంటెంట్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దీంతో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చారు.

ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా ఐటీ శాఖ చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్షసాధింపు చర్యగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై ఐటీ దాడులు జరుగుతుంటే వేధిస్తున్నారని చెప్పడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడటం కేవలం విపక్షాలకే చెల్లిందని దుయ్యబట్టారు.
Andhra Pradesh
IT RAIDS
GOVERNMENT
Arun Jaitly
MEDIA

More Telugu News