Lakshmi: నారాయణపేట దుర్ఘటనలో మృతులంతా ఒకే గ్రామానికి చెందిన మహిళలు!

  • కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి
  • గుట్ట కింద సేద తీరుతుండగా ప్రమాదం
  • గాయాలతో బయటపడిన లక్ష్మి
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఉపాధి కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎండ ఎక్కువగా ఉండటంతో కూలీలంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో మ‌ృతులంతా మహిళలే కావడం గమనార్హం. మృతులంతా పీలేరు గ్రామవాసులే కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఘటనలో సీహెచ్‌ లక్ష్మి అనే మరో మహిళ గాయాలతో బయటపడింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో, కె. లక్ష్మి (30), లక్ష్మి(28), బుడ్డమ్మ(26), పి. అనురాధ(30), మంగమ్మ(32), కేశమ్మ(38), అనంతమ్మ(45), బి. అనంతమ్మ(35), బి. లక్ష్మి(28), బీమమ్మ(40) ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Lakshmi
Anuradha
Mangamma
Ananthamma
beemamma
Buddamma

More Telugu News