subrahmanian swamy: బీజేపీ మేనిఫెస్టోలో రెండు తప్పులను ఎత్తి చూపిన సుబ్రహ్మణ్యస్వామి

  • రైతుల ఆదాయం 2022 నాటికి డబుల్ చేస్తామంటూ హామీ
  • అసాధ్యమన్న సుబ్రహ్మణ్యస్వామి
  • అత్యధిక జీడీపీలో భారత్ 3వ స్థానంలో ఉందని సూచన

సంకల్ప్ పత్ర్ పేరుతో సోమవారంనాడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రజాకర్షక అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయితే, మేనిఫెస్టో రెండు కీలకమైన తప్పిదాలున్నట్టు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మేనిఫెస్టోలో ఉంది. దీన్ని స్వామి తప్పుబట్టారు. రెండింతలు చేయాలంటే వృద్ధి రేటు ఏడాదికి 24 శాతం నమోదు కావాలని... ఇది  అసంభవమని చెప్పారు. ఏడాదికి 10 శాతం వృద్ధి రేటు అయితే సాధించవచ్చని తెలిపారు.

మరోవైపు అత్యధిక జీడీపీ కలిగి ఉన్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉందని పేర్కొన్నారని... వాస్తవానికి భారత్ మూడో స్థానంలో ఉందని స్వామి చెప్పారు. దీన్ని సరిదిద్దాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు సూచించానని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీకి రాజ్ నాథ్ నేతృత్వం వహించారు. 

More Telugu News