Rajinikanth: కమల్ ఆశలపై నీళ్లు చల్లిన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా లోక్ సభ ఎన్నికల్లో కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి మద్దతు తెలపడంలేదంటూ స్పష్టం చేశారు. కొన్నిరోజుల క్రితం కమలహాసన్ మాట్లాడుతూ తన మిత్రుడైన రజనీకాంత్ ఎన్నికల్లో మద్దతు ఇస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, రజనీకాంత్ నిర్మొహమాటంగా మద్దతు ఇవ్వడం లేదంటూ చెప్పేశారు.
అంతేకాదు, ఈ అంశాన్ని పెద్దది చేసి చూడడం ద్వారా తామిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో, బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో చాలా బాగుందంటూ ఈ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పకనే చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న నదుల అనుసంధానం అంశం తనను ఆకట్టుకుందని రజనీ తెలిపారు.