Guntur District: గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐపై బదిలీ వేటు!
ఏపీలో ఎన్నికల తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో మరో పోలీసు అధికారిని ఈసీ బదిలీ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐ శ్రీనివాసరావును బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే శ్రీనివాసరావును ఈసీ బదిలీ చేసింది. సీఐ శ్రీనివాసరావు స్థానంలో సురేశ్ కుమార్ ను నియమించింది.