'కల్కి' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు
- మరోసారి పోలీస్ ఆఫీసర్ గా 'కల్కి'
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
- కథానాయికగా ఆదా శర్మ
ఆదా శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా టీజర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. దశావతారాల్లో 'కల్కి' అవతారం 10వ అవతారం కావడం వలన, ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్టు చెప్పడం విశేషం. ఈ సినిమాతో రాజశేఖర్ మరో హిట్ కొడతారేమో చూడాలి.