Rahul Gandhi: ఏకాకి అయిన ఓ వ్యక్తి గొంతుక మాత్రమే: బీజేపీ మేనిఫెస్టోపై రాహుల్ గాంధీ

  • ఓ గదిలో కూర్చుని తయారు చేశారు
  • స్వల్ప కాల దృష్టితో మాత్రమే బీజేపీ ఆలోచించింది
  • మేనిఫెస్టో అహంకారపూరితమన్న రాహుల్ గాంధీ

'సంకల్ప్ పత్ర్' పేరిట బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఏకాకిగా మారిన నరేంద్ర మోదీ గొంతుకే తప్ప, ప్రజలకు ఉపయోగపడేది కాదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన రాహుల్, మేనిఫెస్టోలోని అంశాలు అహంకారపూరితంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తాము చేయబోయే అంశాలను వివరించామని, విస్తృత చర్చల ద్వారా మేనిఫెస్టో తయారు చేశామని, పది లక్షల మంది భారతీయుల గళం ఇదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, బీజేపీ సంకల్ప పత్రాన్ని ఓ గదిలో తయారు చేశారని, హ్రస్వ దృష్టితో, అహంకారపూరితంతో తయారు చేసిన ఈ మేనిఫెస్టో మోదీ అనే వ్యక్తి గళాన్ని మాత్రమే వినిపిస్తుందని ఎద్దేవా చేశారు.

కాగా, నిన్న ప్రకటించిన బీజేపీ 'సంకల్ప్ పత్ర్'లో కిసాన్‌ పథకంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌ కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలను చేర్చిన సంగతి తెలిసిందే.




More Telugu News