vishal: విశాల్ ను ఎలా అభినందించాలో కూడా తెలియడం లేదు: ఖుష్బూ

  • సుందర్ దర్శకత్వంలో విశాల్ కొత్త చిత్రం
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న ఖుష్బూ
  • షూటింగ్ లో గాయపడ్డ విశాల్
యంగ్ హీరో విశాల్ పై సీనియర్ నటి ఖుష్బూ ప్రశంసలు కురిపించారు. షూటింగ్ లో గాయపడ్డప్పటికీ, నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో, బాధను దిగమింగుకుని షూటింగ్ లో పాల్గొన్నాడని.. అతన్ని ఎలా అభినందించాలో అర్థం కావడం లేదని చెప్పారు. ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో విశాల్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఖుష్బూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టర్కీలో షూటింగ్ జరుగుతుండగా విశాల్ కాలికి గాయమైంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న విశాల్... మూడోరోజు కల్లా షూటింగ్ కు రెడీ అయిపోయాడు.
vishal
khushboo
kollywood
injury

More Telugu News