Andhra Pradesh: జనసేన మంచి ఛాన్స్ ను చేజేతులా పోగొట్టుకుంది: బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు

  • ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది
  • దీన్ని అనుకూలంగా మలచుకోవడంలో జనసేన విఫలం
  • ఈసారి ఫలితాలు మాత్రం అనూహ్యంగా ఉండొచ్చు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు  జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవడంలో జనసేన చేజేతులా పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఏపీలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీపై చంద్రబాబు అనుకూల మీడియా చేసిన వ్యతిరేక ప్రచారాలు పనిచేయలేదని అన్నారు. ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఈరోజు ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గత రెండు రోజులుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షేత్రస్థాయిలో తిరిగాను. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. దానిని తమకు అనుకూలంగా మలుచుకునే సదవకాశాన్ని జనసేన చేజేతులా వదులుకున్నది. బీజేపీపై బాబు గారు వారి అనుకూల మీడియా చేసిన అబద్ధపు ప్రచారాలు పని చేయలేదు. ఫలితాలు అనూహ్యంగా ఉండొచ్చు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Jana Sena
BJP
IYR
KRISHNARAO
Twitter

More Telugu News