kanakamedala: ఈ డబ్బుతో ఢిల్లీలాంటి రాజధానిని కట్టగలమా?: కనకమేడల

  • రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
  • అమరావతిలో రూ. 39వేల కోట్ల పనులు జరుగుతున్నాయి
  • వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి గురించి లేదు
సొంతంగా నిధులను సేకరించి అమరావతిని నిర్మిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రూ. 1500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. అమరావతిలో రూ. 39వేల కోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైతులను ఒప్పించి అమరావతి కోసం భూసేకరణ చేశామని తెలిపారు. వైసీపీకి రాజధానిపై స్పష్టమైన అవగాహన లేదని చెప్పారు. అమరావతి గురించి మేనిఫెస్టోలో కూడా పెట్టలేదని విమర్శించారు. రాజధాని గురించి తెలియని వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఎంతో దూరదృష్టితో నదులను ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసంధానం చేశారని చెప్పారు. 
kanakamedala
amaravathi
delhi
Telugudesam
ysrcp

More Telugu News