Mahesh Babu: 'మహర్షి' పాట విషయంలో తర్జనభర్జనలు?

  • షూటింగు దశలో 'మహర్షి'
  • పెండింగులో రెండు పాటలు
  • మే 9వ తేదీన భారీస్థాయి విడుదల    
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలను .. కొన్ని సన్నివేశాలను ఇంకా చిత్రీకరించవలసి వుంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్స్ వేసి ఈ రెండు పాటలను చిత్రీకరించవలసి వుంది. ఇక మిగతా సన్నివేశాలను అబుదాబీలో చిత్రీకరించనున్నారు.

అయితే సమయం తక్కువగా ఉండటంతో, ఒక పాటను మాత్రమే షూట్ చేసి అబుదాబీ వెళ్లే ఆలోచనలో వున్నారని అంటున్నారు. అవసరమైతే సినిమా విడుదలైన తరువాత మరో పాటను జోడిద్దామనే ఆలోచనలో వున్నారని చెబుతున్నారు. ఒక్క పాట కోసం రిపీట్ ఆడియన్స్ ఉండకపోవచ్చనీ, ఇలా గతంలో విడుదల తరువాత సన్నివేశాలను .. పాటలను కలిపినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని సన్నిహితులు చెబుతున్నారట. మరి ఫైనల్ గా 'మహర్షి' దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 
Mahesh Babu
pooja hegde

More Telugu News