Amitabh Bachchan: డామ్... నాకొకడు పోటీకి వచ్చాడు: అమితాబ్ బచ్చన్

  • నటించబోతున్నానన్న రామ్ గోపాల్ వర్మ
  • ట్విట్టర్ లో సరదాగా స్పందించిన బిగ్ బీ
  • వర్మకు ఆల్ ది బెస్ట్
తాను నటించబోతున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. తనకు పోటీ వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించారు. "చిట్టచివరకు రామ్ గోపాల్ వర్మ... నా 'సర్కార్' తన అసలైన రూట్ కొచ్చారు. నటన... ఆల్ ది బెస్ట్ సర్కార్... డామ్... ఇంకో పోటీ నాకు" అని అన్నారు. అమితాబ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'కోబ్రా' అనే చిత్రంలో తాను కూడా నటిస్తున్నానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.



Amitabh Bachchan
Ramgopal Varma
Acting
Twitter

More Telugu News