Kamal Haasan: ఐటీ దాడులకు కమలహాసన్ మద్దతు!

  • ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై దాడులు జరగాల్సిందే
  • దోషులను శిక్షించాల్సిందే
  • ఇంతకు ముందు కూడా ఇలాంటి దాడులు జరిగాయి
దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు తమిళనాడులోని కాంగ్రెస్ నేతలకు సంబంధించిన పలు నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడంపై మక్కల్ నీధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారిపై ఐటీ దాడులు జరగాల్సిందేనని ఆయన అన్నారు. దోషులుగా తేలిన వారిని శిక్షించాల్సిందేనని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ దాడులు జరగడం లేదని... ఇంతకు ముందు కూడా ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు.
Kamal Haasan
it raids
mnm
congress

More Telugu News